కొవిడ్ టీకాల రిజిస్టరుకు ఎన్ఎస్‌యూఐ హెల్ప్‌లైన్

ABN , First Publish Date - 2021-05-20T12:28:20+05:30 IST

దేశంలో కొవిడ్ టీకాల కోసం రిజిస్టరు చేయించుకునేందుకు వీలుగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది....

కొవిడ్ టీకాల రిజిస్టరుకు ఎన్ఎస్‌యూఐ హెల్ప్‌లైన్

 న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల కోసం రిజిస్టరు చేయించుకునేందుకు వీలుగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ పై పోరాటంలో విజయం సాధించాలంటే టీకాలే కీలకమని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజలకు సహకరించేందుకుగాను తాము హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ చెప్పారు. ఢిల్లీలో జాతీయ కంట్రోల్ రూంతోపాటు రాష్ట్రాల్లోనూ హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఎన్ఎస్‌యూఐ హెల్ప్ లైన్ ఫోన్ నంబరు 76698 86366 ను ఏర్పాటు చేశామని నీరజ్ వివరించారు. కొవిడ్ టీకాల కోసం రిజిస్టరు చేయించుకునేందుకు తమ హెల్ప్ లైన్ వాలంటీర్లు సహకరిస్తారని చెప్పారు. ప్రజలు వారికి సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకువెళ్లడంలో తమ వాలంటీర్లు సహకరిస్తారని నీరజ్ వివరించారు.

Updated Date - 2021-05-20T12:28:20+05:30 IST