ఆ వార్తల్లో నిజం లేదు: కేరళ సీఎం

ABN , First Publish Date - 2021-05-03T00:31:52+05:30 IST

కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ ఇప్పటి వరకు 94 స్థానాల్లో విజయం సాధించి మరోమారు ప్రభుత్వాన్ని

ఆ వార్తల్లో నిజం లేదు: కేరళ సీఎం

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ ఇప్పటి వరకు 94 స్థానాల్లో విజయం సాధించి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాుట చేసేందుకు సిద్ధమైంది. ఎన్నకల్లో ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. ఈ విజయం కేరళ ప్రజలకు అంకితమని అన్నారు. అయితే, ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, కరోనాపై  పోరాడాల్సిన సమయమని అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా రేపు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వస్తున్న వార్తలను విజయన్ ఖండించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. సోమవారం తిరువనంతపురం చేరుకున్న తర్వాత ప్రస్తుత పదవికి రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని విజయన్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-03T00:31:52+05:30 IST