తొందర్లోనే పార్టీకి రాజీనామా చేస్తా : తృణమూల్ ఎమ్మెల్యే ప్రకటన
ABN , First Publish Date - 2021-02-01T21:48:30+05:30 IST
తృణమూల్ కాంగ్రెస్‌కు ఝలక్ తగులుతూనే ఉంది. డైమండ్ హార్బర్ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. పేదల

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్‌కు ఝలక్ తగులుతూనే ఉంది. డైమండ్ హార్బర్ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. పేదల ప్రజల కోసం పనిచేస్తామంటే పార్టీ మోకాలడ్డుతోందని మండిపడ్డారు. ఈ కారణంగానే తాను పార్టీ నుంచి త్వరలోనే వైదొలుగుతానని ప్రకటించారు. ‘‘రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. కానీ 2017 నుంచి పేద ప్రజల కోసం పనిచేయలేకపోయా. ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నా నియోజకవర్గ ప్రజలకు నేను జవాబుదారీ. అందుకే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. తొందర్లోనే అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపుతా.’’ అని దీపక్ హల్దార్ ప్రకటించారు. అయితే బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన స్పందించలేదు.