cruise party: ఆర్యన్‌ఖాన్ వద్ద డ్రగ్స్ లేవు...అతిథిగా క్రూయిజ్ పార్టీకి వెళ్లాడు
ABN , First Publish Date - 2021-10-04T15:08:32+05:30 IST
తన క్లయింట్ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు...
కోర్టులో న్యాయవాది సతీష్ మనేషిండే వాదన
ముంబై:తన క్లయింట్ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను మాదకద్రవ్యాల నిరోధక బృందం అరెస్టు చేసి కేసు పెట్టిన నేపథ్యంలో అతని తరపున లాయర్ సతీష్ మనేషిండే వాదించారు. ఆర్యన్‌ఖాన్ క్రూయిజ్ పార్టీకి కేవలం అతిథిగా ఆహ్వానంపై వెళ్లాడని, అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు కనుగొనలేదని లాయర్ వాదించారు.
ఈ కేసులో ఎన్సీబీ అధికారుల ఒక రోజు కస్టడీ కోసం అంగీకరించామని, ఇది బెయిలబుల్ నేరమని మనేషిండే చెప్పారు. క్రూయిజ్ పార్టీ నిర్వాహకులతో తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు.ఆర్యన్ ఖాన్ కు బెయిలు కోసం న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మన్నత్ లో షారూఖ్ ఇంటికి వచ్చి పరామర్శించారు.