ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్‌కు గడువు లేదు!

ABN , First Publish Date - 2021-12-30T21:40:22+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సంస్థ సభ్యులు

ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్‌కు గడువు లేదు!

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు ఎలక్ట్రానిక్ నామినేషన్‌ను దాఖలు చేసేందుకు ప్రస్తుతానికి నిర్దిష్ట గడువు లేదని ఆ సంస్థ ప్రకటించింది. అంతకుముందు కొన్ని మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గడువు డిసెంబరు 31తో ముగియవలసి ఉంది. ఈపీఎఫ్ఓ అధికారిక ట్విటర్ ఖాతాలో తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ-నామినేషన్‌ను దాఖలు చేయడానికి ఎటువంటి గడువును విధించలేదు. అయితే నేడే దీనిని దాఖలు చేసుకోండని చెప్పింది.


ఈ-నామినేషన్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు 2019 సెప్టెంబరు 12న ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది. ఈపీఎఫ్ఓ మెంబర్ సేవా పోర్టల్‌ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్ నామినేషన్‌ను తర్వాత కాలంలో అవసరమైతే EPFO UAN portal ద్వారా మార్చుకోవచ్చు. యాజమాన్యం అనుమతి అవసరం ఉండదు. 


ఈపీఎఫ్ఓ సభ్యుడు/సభ్యురాలు మరణిస్తే, నామినీలు ఆన్‌లైన్‌లో క్లెయిము చేసుకోవచ్చు. అదేవిధంగా భవిష్య నిధి (పీఎఫ్), పింఛను (ఈపీఎస్), బీమా (ఈడీఎల్ఐ) ప్రయోజనాలను పొందడానికి ఇది దోహదపడుతుంది. 


EPFO website >> Services >> For Employees >> Click "Member UAN/Online Service ద్వారా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినీ ఆధార్ సంఖ్య, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించవలసి ఉంటుంది.


Updated Date - 2021-12-30T21:40:22+05:30 IST