పన్నులు చెల్లించే వారికి నిరాశ కల్పించిన బడ్జెట్
ABN , First Publish Date - 2021-02-01T18:47:09+05:30 IST
పన్నులు చెల్లించేవారిపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లింది. వారికి ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి

న్యూఢిల్లీ : పన్నులు చెల్లించేవారిపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లింది. వారికి ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్య తరగతి ప్రజలు ఎంతైతో ఆశలు పెట్టుకున్నారో... అవన్నీ నిరాశలయ్యాయి. మరోవైపు 75 ఏళ్లు దాటిన వారికి మాత్రం కేంద్రం భారీ ఊరటనిచ్చింది. 75 ఏళ్లు దాటినవారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే చిన్న పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.