కరోనాతో ఎమ్మెల్సీ మృతి... సీఎం నితీశ్ సంతాపం..

ABN , First Publish Date - 2021-05-09T02:31:24+05:30 IST

కరోనా కారణంగా ఇవాళ బీహార్ ఎమ్మెల్సీ, జేడీయూ నేత తన్వీర్ అక్తర్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి...

కరోనాతో ఎమ్మెల్సీ మృతి... సీఎం నితీశ్ సంతాపం..

పాట్నా: కరోనా కారణంగా ఇవాళ బీహార్ ఎమ్మెల్సీ, జేడీయూ నేత తన్వీర్ అక్తర్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్తర్ మరణం బీహార్ రాజకీయ, సామాజిక రంగానికి తీరని లోటు అంటూ సీఎం ట్వీట్ చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ‘‘బీహార్ ఎమ్మెల్సీ తన్వీర్ అక్తర్ మరణం తీవ్ర విచారకరం. ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన మరణం రాజకీయ, సమాజిక రంగాలకు తీరని లోటు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..’’ అని నితీశ్ ట్వీటర్లో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం అక్తర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను పాట్నాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2021-05-09T02:31:24+05:30 IST