ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల పంట పండింది..

ABN , First Publish Date - 2021-02-01T17:22:22+05:30 IST

ఎన్నికలు జరగబోయే తమిళనాడు, బెంగాల్ పై బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడులో 1,03 లక్షల కోట్లతో

ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల పంట పండింది..

న్యూఢిల్లీ : ఎన్నికలు జరగబోయే తమిళనాడు, బెంగాల్ పై బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడులో 1,03 లక్షల కోట్లతో నేషనల్ హైవే నిర్మిస్తున్నారు. దీనిని ఎకనామిక్ కారిడార్‌గా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక కేరళలో కూడా 65 వేల కోట్లతో నేషనల్ హైవేను నిర్మిస్తామని పేర్కొన్నారు. ముంబై - కన్యాకుమారి మధ్య కూడా ఎకనామిక్ కారిడార్‌ను నిర్మిస్తామని తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్ - సిరిగురి మధ్య నేషనల్ హైవేను నిర్మిస్తామని ప్రకటించారు. మరో మూడేళ్లలో అసోంలో కూడా ఎకనామిక్ కారిడార్‌తో పాటు నేషనల్ హైవేలను కూడా నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

Updated Date - 2021-02-01T17:22:22+05:30 IST