రాత్రి కర్ఫ్యూలో తొలిరోజే 39 వాహనాల సీజ్‌

ABN , First Publish Date - 2021-12-30T18:01:21+05:30 IST

కొవిడ్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌ను నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుం చి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. బెంగళూరులో తొ లిరోజు రాత్రి 39 వాహనాలను సీజ్‌ చేశారు. నైట్‌ కర్ఫ్యూ

రాత్రి కర్ఫ్యూలో తొలిరోజే 39 వాహనాల సీజ్‌

                - బెంగళూరు సహా రాష్ట్రమంతటా మూతపడిన ఫ్లైఓవర్లు


బెంగళూరు: కొవిడ్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌ను నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుం చి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. బెంగళూరులో తొలిరోజు రాత్రి 39 వాహనాలను సీజ్‌ చేశారు. నైట్‌ కర్ఫ్యూ అమలులోకి వస్తోందని రాత్రి వేళ అనవసరంగా తిరగరాదని రెండు రోజులుగా పోలీసులు ప్రచారం చేస్తూ వచ్చారు. అయినా నగర వ్యాప్తంగా ఎటువంటి పనులు లేకున్నా అనవసరంగా తిరుగుతున్న 39 వాహనాలను సీజ్‌ చేశారు. కాగా బుధవారం రాత్రి నుంచి దాదాపు ఫ్లైఓవర్లు మూసివేశారు. జాతీయ రహదారులకు అనుబంధంగా ఉండే ఫ్లైఓవర్లు మినహా మిగిలిన వాటిని మూసివేస్తామని ముందుగానే ప్రకటించిన పోలీసులు ఆ దిశగానే అమలు చేశారు. బెంగళూరులోని జక్కూరు, కేఆర్‌ మార్కెట్‌కు అనుబంధమైన ఫ్లైఓవర్లు మూసివేయడంతో ప్రజలు తంటాలు పడాల్సివచ్చింది. రాత్రి 9.30 గంటలకే దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు.

Updated Date - 2021-12-30T18:01:21+05:30 IST