ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ...

ABN , First Publish Date - 2021-12-27T02:10:44+05:30 IST

దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం..

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ...

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 27వ తేదీ సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది.


ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 290 కోవిడ్ కేసులు నమోదు కావడం, ఒకరు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది. శనివారం సైతం 249 కొత్త కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్లను ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఇప్పటికే అప్రమత్తం చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో కోవిడ్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించాలని అదేశించింది.

Updated Date - 2021-12-27T02:10:44+05:30 IST