జలాలాబాద్‌లో bike blast కేసులో ఎన్‌ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2021-11-02T13:20:26+05:30 IST

జలాలాబాద్‌ బైక్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది...

జలాలాబాద్‌లో bike blast కేసులో ఎన్‌ఐఏ సోదాలు

జలాలాబాద్‌(పంజాబ్)‌: జలాలాబాద్‌ బైక్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది.ఫజిల్కా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తాజాగా సోదాలు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు.పేలుళ్లకు పాల్పడిన నిందితులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, స్మగ్లర్లతో సంబంధాలున్నాయని వెల్లడైంది. నిందితులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేయడానికి పాక్ వారిని నియమించుకుందని ఎన్ఐఏ అధికారి తెలిపారు.


ఈ పేలుళ్ల కేసులో అక్టోబర్‌లో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసింది.ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ రికవరీ చేసింది. పేలుళ్ల నిందితుడికి పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులు,  స్మగ్లర్లతో సంబంధాన్ని నిర్ధారించే నేరారోపణ పత్రాలు లభించాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారి తెలిపారు.


Updated Date - 2021-11-02T13:20:26+05:30 IST