త్రిపురలో కొత్తగా లక్ష కుటుంబాలకు వాటర్ కనెక్షన్లు : కేంద్ర మంత్రి షెఖావత్

ABN , First Publish Date - 2021-01-13T18:01:45+05:30 IST

త్రిపురలో సురక్షిత తాగు నీటి సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు

త్రిపురలో కొత్తగా లక్ష కుటుంబాలకు వాటర్ కనెక్షన్లు : కేంద్ర మంత్రి షెఖావత్

అగర్తల : త్రిపురలో సురక్షిత తాగు నీటి సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ చెప్పారు. రాబోయే మూడు నెలల్లో దాదాపు లక్ష కుటుంబాలకు వాటర్ కనెక్షన్లను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. త్రిపురను జల జీవన్ మిషన్ క్రింద అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 


షెఖావత్ మంగళవారం జల శక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన వేర్వేరు అభివృద్ధి పథకాలు త్రిపురలో అమలవుతున్న తీరును సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశం రాష్ట్ర అతిథి గృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటి వరకు 1.5 లక్షల కుటుంబాలకు వాటర్ సప్లయ్ కనెక్షన్లను మంజూరు చేసిందని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మరొక లక్ష కుటుంబాలకు వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. జల జీవన్ మిషన్ క్రింద అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రంగా త్రిపురను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 


అంతకుముందు షెఖావత్ నార్త్ బిజోయ్ నగర్ గ్రామ పంచాయతీలో రెండు తాగునీటి సరఫరా పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T18:01:45+05:30 IST