మార్‌బర్గ్ వైరస్ ఎలా బయటపడిందంటే

ABN , First Publish Date - 2021-08-11T05:29:19+05:30 IST

ప్రపంచాన్ని కబళించేందుకు వైరస్‌లన్నీ ఒక్కసారిగా దాడికి సిద్ధమయ్యాయా..? అన్నట్లు అనిపిస్తోంది. ఒకపక్క కరోనా వైరస్ రకరకాల వేరియంట్లుగా..

మార్‌బర్గ్ వైరస్ ఎలా బయటపడిందంటే

జోహన్నెస్‌బర్గ్: ప్రపంచాన్ని కబళించేందుకు వైరస్‌లన్నీ ఒక్కసారిగా దాడికి సిద్ధమయ్యాయా..? అన్నట్లు అనిపిస్తోంది. ఒకపక్క కరోనా వైరస్ రకరకాల వేరియంట్లుగా వివిధ దేశాలను వణికిస్తున్న సమయంలోనే మరోపక్క కొత్త కొత్త వైరస్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే సౌత్‌ఆఫ్రికాలో కొత్తగా మార్క్‌బర్క్ వైరస్ బయటపడింది. ఈ వైరస్ సోకిన తొలి వ్యక్తి ఏకంగా మరణించాడు కూడా. గత జులై25న ఓ వ్యక్తి తనకు జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పిగా ఉందంటూ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. ఆగస్టు 1న అతనికి చికిత్స అందించడం మొదలుపెట్టారు. కానీ మరుసటి రోజే అతను చనిపోయాడు. దాంతో స్థానిక వైద్యాధికారులు వెంటనే అతడి మరణానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే డాక్టర్లకు షాకింగ్ విషయం అర్థమైంది. మృతుడు మార్క్‌బర్క్ వైరస్ బారిన పడినట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. 


ఈ వైరస్ కూడా కరోనా లానే గాలి ద్వారా సోకే వైరస్ కావడంతో కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌, ప్రజలను చైతన్యపరచే కార్యక్రమాలకు అక్కడి వైద్యులతో పాటు ప్రభుత్వాలు ప్రారంభించాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ వైరస్ కూడా కోవిడ్ లానే గబ్బిలాల ద్వారానే వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. 


కాగా.. ఈ వైరస్ సోకిన తర్వాత బాధితుడిపై 7 రోజులపాటు తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనివల్ల రక్తనాళాలు చిట్లిపోయే ముప్పు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మరణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కోవిడ్‌‌లానే ఈ వైరస్‌కు కూడా సరైన చికిత్సా విధానం గానీ, నివారణకు ఔషధాలు కానీ లేవు. 

Updated Date - 2021-08-11T05:29:19+05:30 IST