ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్న కేంద్ర మంత్రులు

ABN , First Publish Date - 2021-07-08T20:23:21+05:30 IST

ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. తమ కుటుంబీకులు, మంత్రుల మధ్య

ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్న కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ : ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. తమ కుటుంబీకులు, మంత్రుల మధ్య నూతన మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిగా మన్సుఖ్ మాండవ్య, రైల్వే మంత్రిగా అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ప్రసార మంత్రిగా అనురాగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రిగా కిషన్ రెడ్డి, న్యాయమంత్రిగా కిరణ్ రిజిజు, పెట్రోలియం మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమాన మంత్రిగా సింధియా, సర్బానంద సోనోవాలా, భూపేంద్ర యాదవ్, బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు దర్శన్ విక్రమ్, రావ్ సాహెబ్ దాదారావ్, మీనాక్షి లేఖీ, మహేంద్ర భాయ్, జిత్రేంద్ర సింగ్, ధర్మంద్ర ప్రధాన్, అజయ్ భట్, శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖరన్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలందరూ గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు. వారందరికీ నడ్డా మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-08T20:23:21+05:30 IST