ఈ చీమ పేరు.. ‘అమితాబ్‌’

ABN , First Publish Date - 2021-01-24T08:39:30+05:30 IST

అరుదైన చీమల రకానికి చెందిన రెండు కొత్త జాతులను పంజాబీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేరళలోని పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌, తమిళనాడులోని అడవుల్లో జరిపిన అధ్యయనంలో వీటిజాడ లభ్యమైంది...

ఈ చీమ పేరు.. ‘అమితాబ్‌’

  • కేరళ, తమిళనాడుల్లో రెండు కొత్త చీమ జాతుల గుర్తింపు


న్యూఢిల్లీ, జనవరి 23 : అరుదైన చీమల రకానికి చెందిన రెండు కొత్త జాతులను పంజాబీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేరళలోని పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌, తమిళనాడులోని అడవుల్లో జరిపిన అధ్యయనంలో వీటిజాడ లభ్యమైంది. గతంలో చీమలపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రముఖ బయాలజిస్ట్‌ అమితాబ్‌ జోషి గౌరవార్ధం ఈరెండింటిలో ఒక చీమ జాతికి ‘ఓసెరియా జోషీ’ అని పేరు పెట్టారు. గతంలో శాస్త్రవేత్తలు గుర్తించిన చీమల జాతులకు.. ఈ కొత్త రకం చీమలకు ప్రధాన తేడా వాటి తలపై ఉండే రెండు యాంటెనాల నిర్మాణంలోనే ఉంటుంది. 

Updated Date - 2021-01-24T08:39:30+05:30 IST