‘అయోధ్యాపురి’కి నిధులు కేటాయించిన నేపాల్‌

ABN , First Publish Date - 2021-05-30T10:04:56+05:30 IST

నేపాల్‌లోని చితావన్‌ జిల్లాలో ఉన్న అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. రాజకీయ సంక్షోభం

‘అయోధ్యాపురి’కి నిధులు కేటాయించిన నేపాల్‌

కఠ్మాండు, మే 29: నేపాల్‌లోని చితావన్‌ జిల్లాలో ఉన్న అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. రాజకీయ సంక్షోభం నడుమ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన నేపాల్‌ బడ్జెట్‌ సందర్భంగా ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి బిష్ణు పౌడ్యాల్‌ ప్రకటించారు. పశుపతినాథ్‌ దేవాలయ పునరుద్ధరణకు రూ.35కోట్లు(నేపాలీ కరెన్సీ) కేటాయించామని చెప్పిన పౌడ్యాల్‌.. రామాలయానికి కేటాయించిన మొత్తాన్ని వెల్లడించలేదు. 

Updated Date - 2021-05-30T10:04:56+05:30 IST