మయన్మార్ సరిహద్దులను మూసేసిన భారత్!

ABN , First Publish Date - 2021-03-22T20:21:26+05:30 IST

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

మయన్మార్ సరిహద్దులను మూసేసిన భారత్!

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడి నుంచి వలసలను నిరోధించే ఉద్దేశంతో మయన్మార్‌తో ఉన్న సరిహద్దులన్నింటినీ మూసేసింది. ఈ మేరకు మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తాంగా, మయన్మార్ విదేశీ వ్యవహారాల మంత్రి జిన్ మర్ అంగ్‌తో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్‌ను ఆ దేశపు సైన్యం అదుపులోకి తీసుకుంది. దీంతో సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమకారులతో సైన్యం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందల మంది ఉద్యమకారులు సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. 

Updated Date - 2021-03-22T20:21:26+05:30 IST