సమీర్‌ వాంఖడేకు భద్రత పెంపు

ABN , First Publish Date - 2021-10-15T03:44:56+05:30 IST

ముంబై: షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌‌ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ కీలక అధికారి సమీర్‌ వాంఖడేకు భద్రతను పెంచారు.

సమీర్‌ వాంఖడేకు భద్రత పెంపు

ముంబై: షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌‌ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ కీలక అధికారి సమీర్‌ వాంఖడేకు భద్రతను పెంచారు. ఆయనకు ప్రస్తుతమున్న అంగరక్షకులతో పాటు సాయుధ జవాన్ల సంఖ్యను పెంచారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం బయట కూడా పోలీస్ పహారాను పెంచారు. తనపై కొందరు నిఘా పెట్టినట్టు మహారాష్ట్ర డీజీపీకి వాంఖడే స్వయంగా ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పోలీసులు భద్రతను పెంచారు. తన కదలికలను ఎవరో గమనిస్తున్నారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. వాంఖడే తరచుగా తన తల్లి సమాధి ఉన్న శ్మశానానికి వెళ్తుంటారని, పోలీసు అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఆ శ్మశానం ఉన్న చోటుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని సేకరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-10-15T03:44:56+05:30 IST