ఎన్జీటీలో Telangana సర్కార్‎కు చుక్కెదురు..

ABN , First Publish Date - 2021-10-29T16:46:26+05:30 IST

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‎లో తెలంగాణ సర్కార్‎కు చుక్కెదురైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ బ్రేక్‌ వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లొద్దని ఎన్జీటీ ఆదేశించింది

ఎన్జీటీలో Telangana సర్కార్‎కు చుక్కెదురు..

ఢిల్లీ: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‎లో తెలంగాణ సర్కార్‎కు చుక్కెదురైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ బ్రేక్‌ వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లొద్దని ఎన్జీటీ ఆదేశించింది. తాగునీటి కోసం ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను..సాగునీటి కోసం విస్తరించటాన్ని ఏపీ సర్కార్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు అక్రమమని జగన్ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. మరోవైపు.. ఏపీ సర్కార్‌తో పాటు రైతులు కూడా కోరారు. దీంతో ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కేంద్ర అటవిశాఖ అనుమతులు తప్పనిసరి అని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది.

Updated Date - 2021-10-29T16:46:26+05:30 IST