ఎంపీలో కొవిడ్‌ రోగులకు నాసల్‌ ఎండోస్కోపీ

ABN , First Publish Date - 2021-05-20T07:03:19+05:30 IST

కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ రోగులకు ప్రారంభ దశలోనే ‘నాసల్‌ ఎండోస్కోపీ’ నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది

ఎంపీలో కొవిడ్‌ రోగులకు నాసల్‌ ఎండోస్కోపీ

భోపాల్‌, మే 19: కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ రోగులకు ప్రారంభ దశలోనే ‘నాసల్‌ ఎండోస్కోపీ’ నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమానితుల్లో బ్లాక్‌ ఫంగ్‌సను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందిస్తామని ఆ రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి విశ్వాస్‌ కైలాష్‌ సారంగ్‌ తెలిపారు. అన్ని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాసల్‌ ఎండోస్కోపీని ఉచితంగా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-20T07:03:19+05:30 IST