నాగవార-గొట్టిగెరె మెట్రో మార్గానికి హైకోర్టు పచ్చజెండా

ABN , First Publish Date - 2021-07-17T16:25:55+05:30 IST

నగరంలోని నాగవార - గొట్టిగెరె మెట్రో రైలు మార్గానికి హైకోర్టు పచ్చజెండా చూపింది. ఈ మార్గంలో మెట్రో రైలు కో సం వేలాది చెట్లను అక్రమంగా నరికేస్తున్నారంటూ బెంగళూరు పరిసర ట్ర

నాగవార-గొట్టిగెరె మెట్రో మార్గానికి హైకోర్టు పచ్చజెండా

బెంగళూరు: నగరంలోని నాగవార - గొట్టిగెరె మెట్రో రైలు మార్గానికి హైకోర్టు పచ్చజెండా చూపింది. ఈ మార్గంలో మెట్రో రైలు కో సం వేలాది చెట్లను అక్రమంగా నరికేస్తున్నారంటూ బెంగళూరు పరిసర ట్రస్టుకు చెందిన దత్తాత్రేయ దేవరు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఈ మేరకు గురువారం షరతులతో కూడిన అనుమతిని మంజూ రు చేసింది. ప్రజలకు ఉత్తమ మౌలిక సదుపాయాల ను కల్పించేందుకు చేపట్టిన మెట్రో రైలు మార్గం పనులను అడ్డుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయప డింది. ఈ మార్గంకోసం చెట్ల నరికివేతకు పరిహారంగా మొత్తం 4వేల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత ను పూర్తిగా బీఎంఆర్‌సీఎల్‌ చేపట్టాలని ధర్మాసనం సూచించింది. మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగా సాగితే సహించబోమని హెచ్చరించింది. 33 రకాల మొక్కలను నాటాలని సూచించింది.  


Updated Date - 2021-07-17T16:25:55+05:30 IST