ఆన్‌లైన్‌ చదువుకు మస్క్‌ రూ.37 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2021-01-13T07:45:33+05:30 IST

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజమైన ఎలోన్‌ మస్క్‌ ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు రూ.37

ఆన్‌లైన్‌ చదువుకు మస్క్‌ రూ.37 కోట్ల విరాళం

వాషింగ్టన్‌, జనవరి 12: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజమైన ఎలోన్‌ మస్క్‌ ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు రూ.37 కోట్ల మేరకు విరాళమిచ్చారు. మస్క్‌ గ్రూప్‌ కంపెనీలలో ఒకటైన మస్క్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ డబ్బును అమెరికాలోని లాభాపేక్ష లేని విద్యా సంస్థ ఖాన్‌ అకాడమీకి ఇటీవల అందించారు.

ఎలోన్‌ మస్క్‌, ఆయన సోదరుడు కింబల్‌ కలిసి 2002లో ఈ చారిటబుల్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు వారు విరాళాలిస్తూ వారు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. 


Updated Date - 2021-01-13T07:45:33+05:30 IST