కరోనా కల్లోలం: ముంబైలో తిరిగి ఆంక్షలు... ప్రకటించనున్న సీఎం!

ABN , First Publish Date - 2021-03-14T16:36:00+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటం ప్రభుత్వాన్ని...

కరోనా కల్లోలం: ముంబైలో తిరిగి ఆంక్షలు... ప్రకటించనున్న సీఎం!

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో ఈనెల 16 నుంచి ముంబైలోని కొన్నిప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కార్యాలయాల కార్యకలాపాలకు నూతన విధానాలు, ఆలయాలు, ధార్మిక స్థలాలలో కరోనా నియంత్రణకు నూతన నియమాలను కఠినంగా అమలు చేయనున్నారు. లాక్‌డౌన్ గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే సూచన ప్రాయంగా తెలిపారు. 


కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు. కాగా శనివారం నాగపూర్‌లో అత్యధికంగా 1,828 కరోనా కేసులు నమోదు కాగా, ముంబైలో 1,709, పూణెలో కొత్తగా 1,667 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముంబై, నాగపూర్, నాశిక్, థానె జిల్లాలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదేవిధంగా మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమవుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. కాగా మహారాష్ట్రలో కరోనా కట్టడి చర్యలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈనెల 16న అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ గురించి ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Updated Date - 2021-03-14T16:36:00+05:30 IST