ఉగ్రదాడులు జరగొచ్చంటూ సమాచారం.. ముంబై అలర్ట్
ABN , First Publish Date - 2021-12-31T00:28:18+05:30 IST
ముంబై: ఆంగ్ల సంవత్సరాది వేడుకల వేళ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో అలర్ట్ ప్రకటించారు.

ముంబై: ఆంగ్ల సంవత్సరాది వేడుకల వేళ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో అలర్ట్ ప్రకటించారు. ఖలీస్థానీ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చేనే నిఘావర్గాల సమాచారం అందడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై, బాంద్రా, దాదర్, చర్చ్‌గేట్, కుర్ల తదితర స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. 3వేల మంది పోలీసులను ప్రధాన స్టేషన్ల వద్ద మోహరిస్తామని ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ ఖలిద్ తెలిపారు.