డోర్ టు డోర్ వ్యాక్సినేషన్‌పై ఆలోచించండి
ABN , First Publish Date - 2021-05-13T08:44:23+05:30 IST
డోర్ టు డోర్ వ్యాక్సినేషన్‌పై ఆలోచించండి

కేంద్రానికి ముంబై హైకోర్టు సూచన
ముంబై, మే 12: కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసే కార్యక్ర మం (డోర్ టు డోర్ వ్యాక్సినేషన్) ప్రారంభించి ఉంటే ఎంతోమంది వృద్ధులు, ప్రముఖుల ప్రాణాలను కాపాడగలిగేదని ముంబై హైకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కుల్‌కర్ణిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లలేనివారికి ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా హైకోర్టు ఈ సూచనలు చేసింది.