డీఎంకే ఎంపీ రాజాకు సతీవియోగం

ABN , First Publish Date - 2021-05-30T18:11:29+05:30 IST

వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది...

డీఎంకే ఎంపీ రాజాకు సతీవియోగం

చెన్నై : డీఎంకే ఉపప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు ఎ.రాజాకు సతీవియోగం కలిగింది. గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సతీమణి పరమేశ్వరి (53) శనివారం సా యంత్రం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. సుమారు నెల రోజులుగా రెలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం క్షీణించడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వెళ్లి పరామర్శించారు. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం 7.10 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పరమేశ్వరి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Updated Date - 2021-05-30T18:11:29+05:30 IST