లాక్‌డౌన్‌లో ఉచితంగా ఆహారం పంపిణీ

ABN , First Publish Date - 2021-05-05T17:39:15+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభ‌ణ నేప‌ధ్యంలో...

లాక్‌డౌన్‌లో ఉచితంగా ఆహారం పంపిణీ

పట్నా: కరోనా మహమ్మారి విజృంభ‌ణ నేప‌ధ్యంలో బీహార్‌లో లాక్‌డౌన్‌ విధించారు. ఈ నేప‌ధ్యంలో మాజీ ఎంపీ, జ‌న్ అధికార్ పార్టీ నాయకుడు పప్పు యాదవ్ త‌న ఉదార‌త‌ను చాటుతున్నారు. బీహార్‌లోని వివిధ ఆసుపత్రుల‌ను సందర్శించి, ఆక్సిజన్‌తో సహా అవసరమైన మందులను అందిస్తున్న ప‌ప్పూ యాద‌వ్‌, ఇప్పుడు పేద‌ల‌కు ఉచితంగా ఆహారాన్ని అందించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. గ‌తంలో పట్నాలో వరదలు వచ్చినప్పుడు ఉచితంగా ఆహారాన్ని అందించిన పప్పు యాదవ్... పట్నాలో గ‌ల త‌న నివాసంలో మరోసారి భారీ వంటగదిని ఏర్పాటు చేశారు 


ఇక్కడ ప్రతిరోజూ వేలాది మందికి ఆహారం అందించ‌నున్నారు. అలాగే ఉచితంగా తాగునీరు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పప్పు యాదవ్ మాట్లాడుతూ సీఎంసీహెచ్, ఎన్‌ఎంసీహెచ్, ఎయిమ్స్‌లో జన్‌ అధికార్ సేవాదళ్ తరఫున ఆహార పంపిణీ చేశామ‌న్నారు. పేద ప్రజలందరికీ ఆహారాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఇందుకోసం పార్టీ త‌ర‌పున మూడు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశామ‌న్నారు. కోవిడ్ ఆసుపత్రిలో చేరిన బాధితుల‌కు, పారా వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికుల‌కు ఉచితంగా ఆహారం అందిస్తున్నామ‌న్నారు. 

Updated Date - 2021-05-05T17:39:15+05:30 IST