నీరు చేరి ధ్వంసమైన మోటర్లు

ABN , First Publish Date - 2021-09-02T14:12:37+05:30 IST

ఉద్యోగుల అలసత్వం కారణంగా సెంట్రల్‌ మెట్రో రైల్వేస్టేషన్‌లో రూ. కోటి విలువైన విద్యుత్‌ మోటర్లు ధ్వంసమయ్యాయి. ఈ స్టేషన్‌ను ఆనుకొని కూవం నది ప్రవహిస్తుండడంతో మెట్రో సొరంగ మార్గాల్లో వర్షా

నీరు చేరి ధ్వంసమైన మోటర్లు

ఐసిఎఫ్‌(చెన్నై): ఉద్యోగుల అలసత్వం కారణంగా సెంట్రల్‌ మెట్రో రైల్వేస్టేషన్‌లో రూ. కోటి విలువైన విద్యుత్‌ మోటర్లు ధ్వంసమయ్యాయి. ఈ స్టేషన్‌ను ఆనుకొని కూవం నది ప్రవహిస్తుండడంతో మెట్రో సొరంగ మార్గాల్లో వర్షాకాలాల్లో 3 అడుగుల ఎత్తు వరకు నీరు లీకవుతుంటుంది. ఈ నీటిని ప్రతిరోజూ మోటర్లతో తొలగిస్తున్నారు. సెంట్రల్‌ మెట్రోస్టేషన్‌ పంపింగ్‌ రూంలో ఉన్న భారీ నీటి తొట్టెను నాలుగు రోజుల క్రితం చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు ద్వారా నింపారు. నీటి తొట్టె నిండినా సిబ్బంది సకాలంలో ఆపకపోవడంతో నీరు పంపింగ్‌ రూంలోకి ప్రవేశించడంతో రూ.కోటి విలువైన ఆరు అత్యాధునిక విద్యుత్‌ మోటర్లు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన విద్యుత్‌ మోటర్లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని మెట్రో రైల్‌ లిమిటెడ్‌ సదరు ప్రైవేటు సంస్థను ఆదేశించింది.

Updated Date - 2021-09-02T14:12:37+05:30 IST