ఏడేళ్ల బాలుడ్ని కొట్టి చంపేసిన కన్నతల్లి!

ABN , First Publish Date - 2021-06-22T07:19:31+05:30 IST

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టిందని భావించిన

ఏడేళ్ల బాలుడ్ని కొట్టి చంపేసిన కన్నతల్లి!

దెయ్యం పట్టిందని భావించి..

సహకరించిన ఇద్దరు పినతల్లులు.. తమిళనాడులో ఘటన

తిరువణ్ణామలై, జూన్‌ 21: తమిళనాడులో దారుణం జరిగింది. ఓ ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టిందని భావించిన.. కన్నతల్లి, ఇద్దరు పినతల్లులు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన.. వెల్లూరు జిల్లా అరయూర్‌లో జరిగింది. తిరువణ్ణామలై జిల్లా ఆరణికి చెందిన శబరి (7) మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం ఆ బాలుడికి ఫిట్స్‌ తీవ్ర స్థాయిలో వచ్చి విలవిల్లాడుతుండగా.. అతడికి దెయ్యం పట్టిందని భావించిన తల్లి.. తన ఇద్దరు చెల్లెళ్లు భాగ్యలక్ష్మి, కవితతో కలిసి బాలుడిపై దాడికి తెగబడింది. అతడ్ని తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. .  


Updated Date - 2021-06-22T07:19:31+05:30 IST