‘అమ్మా’ నుషానికి పాల్పడిన కొడుక్కి ఉరి

ABN , First Publish Date - 2021-07-12T08:55:08+05:30 IST

మద్యానికి బానిసైన ఆ వ్యక్తి తాగేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో వృద్ధురాలైన తల్లిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు.

‘అమ్మా’ నుషానికి పాల్పడిన కొడుక్కి ఉరి

ముంబై, జూలై 11: మద్యానికి బానిసైన ఆ వ్యక్తి తాగేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో వృద్ధురాలైన తల్లిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. ఆమె శరీరం నుంచి అవయవాలను వేరు చేశాడు. కొన్ని భాగాలను ఫ్రై చేసుకొని తిన్నాడు. కంచంలో తల్లి గుండెకాయ పెట్టుకొని ఉన్నస్థితిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలో ఈ ఘోరం జరిగితే ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని చచ్చేదాకా ఉరితీయాలంటూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో తల్లి అనుభవించిన నరకయాతనను మాటల్లో వర్ణించలేమని, మద్యం తాగాలనే కోరికను తీర్చుకునేందుకు తల్లిని హత్యచేసి మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చాడని న్యాయమూర్తి మహేశ్‌ కృష్ణాజీ జాదవ్‌ వ్యాఖ్యానించారు. శిక్ష పడ్డ ముద్దాయి పేరు కె.సునీల్‌ రామ (35). కాగా, ఈ తీర్పును మహారాష్ట్ర హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. 

Updated Date - 2021-07-12T08:55:08+05:30 IST