తల్లీకూతుళ్ల దారుణహత్య

ABN , First Publish Date - 2021-12-08T17:01:48+05:30 IST

విల్లుపురం సమీపం కవితారంబట్టు కండన్‌చావిడి వద్ద ఓ ఇంటిలో నివసిస్తున్న తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి నగలు దోచుకుని పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కండన్‌చావిడి వద్ద సరోజ (75) ఆమె కుమార్తె పూంగావనం

తల్లీకూతుళ్ల దారుణహత్య

చెన్నై: విల్లుపురం సమీపం కవితారంబట్టు కండన్‌చావిడి వద్ద ఓ ఇంటిలో నివసిస్తున్న తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి నగలు దోచుకుని పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కండన్‌చావిడి వద్ద సరోజ (75) ఆమె కుమార్తె పూంగావనం (55) నివసిస్తు న్నారు. సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటిలో చొరబడిన దొంగలు నిద్రలో ఉన్న తళ్లీ కూతుళ్లపై దుడ్డుకర్రలతో దాడిచేసి వారి నగలను దోచుకుని పారిపోయారు. ఈ దొంగలు ఓ ఇటుకబట్టీ వద్ద నివసిస్తున్న దంపతుల వద్ద దోచుకునేందుకు ప్రయత్నించి స్థాని కులు గమనించటంతో పారిపోయారు. మంగళవారం ఉదయం సరోజ ఇంటికి ఆమె బంధువు వెళ్ళినప్పుడు వంటినిండా గాయాలతో ఇద్దరూ శవాలుగా పడి ఉండటం చూసి  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కండమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


Updated Date - 2021-12-08T17:01:48+05:30 IST