వానరాల ప్రతీకారం

ABN , First Publish Date - 2021-12-19T07:51:44+05:30 IST

కోతులు పగబడతా యా? తమకు హాని తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాయా? బహుశా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ...

వానరాల ప్రతీకారం

కోతిపిల్లను చంపిన కుక్కల మంద

పగతో రగులుతున్న మర్కటాలు

నెలలో 250 కుక్క పిల్లల్ని చంపాయి

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఘటన 

స్కూల్‌ పిల్లలపై దాడులు.. ఆందోళన


ముంబై, డిసెంబరు 18: కోతులు పగబడతా యా? తమకు హాని తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాయా? బహుశా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఓ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా లో వెలుగుచూడటంతో ఈ ప్రశ్నలకు ఔను అని చెప్పకతప్పదేమో! జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవ ల ఓ కోతిపిల్లపై కొన్ని కుక్కలు దాడి చేసి చంపేశాయి. అప్పటి నుంచి అక్కడి కోతులు కుక్కలపై పగతో రగిలిపోతున్నాయి. ఎక్కడ కుక్కపిల్ల కనిపించినా చేతుల్లోకి తీసుకొని భవనాల మీద నుంచో, చెట్ల చిటారు కొమ్మల మీద నుంచో కిందకు వదిలేసి చంపుతున్నాయి. ఆ ఊర్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా గత నెలరోజు ల్లో 250 కుక్కపిల్లలను చంపేశాయి. దీంతో ఇళ్లలో కుక్కపిల్లలు పెంచుకుం టున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. కోతుల ప్రతీకారేచ్ఛ వల్ల మహారాష్ట్ర సరిహద్దు ఆవల 10 కిలోమీటర్ల దూరంలోని లవూల్‌ గ్రామం లో ఒకే ఒక్క కుక్కపిల్ల మిగిలింది. కోతుల భయంతో దాన్ని పెంచుకుంటున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోతులు స్కూల్‌ పిల్లలపైనా దాడికి పాల్పడటంతో ప్రజలు భయపడుతున్నారు.

Updated Date - 2021-12-19T07:51:44+05:30 IST