హిందీ వస్తేనే డబ్బులు రీఫండ్!
ABN , First Publish Date - 2021-10-20T08:10:57+05:30 IST
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ట్విటర్ వేదికగా విమర్శల పాలైంది. కస్టమర్‌కు హిందీ తెలియదన్న కారణంతో జొమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆయనకు రీఫండ్‌ను నిరాకరించడం తీవ్ర దుమారం రేపింది.

తమిళ కస్టమర్‌కు ‘జొమాటో’ షాక్
చెన్నై, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ట్విటర్ వేదికగా విమర్శల పాలైంది. కస్టమర్‌కు హిందీ తెలియదన్న కారణంతో జొమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆయనకు రీఫండ్‌ను నిరాకరించడం తీవ్ర దుమారం రేపింది. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తీరును ట్విటర్లో కస్టమర్ వివరించాడు. అదిట్రెండ్ కావడంతో జొమాటో దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. ఇది ఆ ఉద్యోగి అజ్ఞానంతో జరిగిన తప్పు అని పేర్కొంది. తమిళనాడుకు చెందిన వికాస్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. వచ్చిన పార్శిల్లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాడు. ఆ ఎగ్జిక్యూటివ్ హిందీలో మాట్లాడగా.. వికాస్ తనకు ఆ భాష రాదని చెప్పాడు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.