జిల్లా కలెక్టర్లు, అధికారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2021-05-20T18:05:43+05:30 IST

ఢిల్లీ: కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

జిల్లా కలెక్టర్లు, అధికారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ఢిల్లీ: కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 10 రాష్టాలకు చెందిన కలెక్టర్లు, 54 జిల్లాల అధికారులతో ఈ సమావేశం జరగనుంది. చత్తీస్‌ఘడ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు తీసుకుంటున్న చర్యలు సహా వారి అనుభవాలను ప్రధాని మోదీ తెలుసుకోనున్నారు.

Updated Date - 2021-05-20T18:05:43+05:30 IST