టీకాకరణపై మాట నిలబెట్టుకోని మోదీ ప్రభుత్వం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-31T22:59:38+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి ప్రధాన

టీకాకరణపై మాట నిలబెట్టుకోని మోదీ ప్రభుత్వం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2021 చివరికల్లా అర్హులైనవారందరికీ పూర్తిగా కోవిడ్-19 టీకాలు అందజేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఓ ట్వీట్‌లో మండిపడ్డారు. 


2021 చివరికల్లా అర్హులందరికీ కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. 2021 పూర్తయి, 2022 రాబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ శుక్రవారం ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. 


‘‘2021 చివరికల్లా అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం వాగ్దానం చేసింది. నేడు సంవత్సరం ముగియబోతోంది. దేశం వ్యాక్సిన్‌ నుంచి ఇంకా దూరంగానే ఉంది. మరో వాగ్దానం మట్టి కరిచింది’’ అని పేర్కొన్నారు. 


కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నానికి 144.67 కోట్లకుపైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. 84.51 కోట్ల మంది లబ్ధిదారులకు మొదటి మోతాదు టీకాను ఇచ్చారు. 60.15 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు మోతాదుల టీకాలను ఇచ్చారు. 18 ఏళ్ళ వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు. అంటే మన దేశంలో టీకాకరణకు అర్హులు 94 కోట్ల మంది ఉన్నారు. 


Updated Date - 2021-12-31T22:59:38+05:30 IST