అన్నింటా మోదీ సర్కారు విఫలం
ABN , First Publish Date - 2021-11-26T09:02:03+05:30 IST
మోదీ సర్కారుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి నిప్పులు చెరిగారు. అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని,

అది మూర్ఖుల ప్రభుత్వం: సుబ్రమణ్యస్వామి
న్యూఢిల్లీ, నవంబరు 25: మోదీ సర్కారుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి నిప్పులు చెరిగారు. అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని, అది మూర్ఖులతో కూడిన ప్రభుత్వమని విమర్శించారు. ఆర్థికం, సరిహద్దు భద్రత వంటి రంగాల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందని ట్విటర్లో ధ్వజమెత్తారు. విదేశాంగ విధానం, జాతీయ భద్రత, అంతర్గత భద్రత, పెగాసస్, కశ్మీర్ అంశం ఇలా అన్నింట్లోనూ మోదీ సర్కారు విఫలమైందని స్వామి పేర్కొన్నారు. మమతను కలిసిన తర్వాత స్వామి వైఖరి మారింది.