మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-08T15:38:02+05:30 IST
మద్రాస్ మెడికల్ మిషన్, జాన్సన్ సంస్థ సంయుక్తంగా మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్‌ను ప్రారంభించాయి. ఈ వాహనంలో వైద్యబృందం తమిళనాడుతో పాటు కేరళలోనూ ప్రయాణిస్తూ గుండె జబ్బుల

చెన్నై: మద్రాస్ మెడికల్ మిషన్, జాన్సన్ సంస్థ సంయుక్తంగా మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్‌ను ప్రారంభించాయి. ఈ వాహనంలో వైద్యబృందం తమిళనాడుతో పాటు కేరళలోనూ ప్రయాణిస్తూ గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారు. అంతేగాక బాధితులకు వైద్య, శస్త్రచికిత్సల చర్యల గురించి సలహా ఇస్తారు. సుగర్, బీపీ, ఈసీజీ, ఎకో, ట్రేడ్‌మిల్ వంటి పరిశోధనలకు అవసరమైన పరికరాలతో కూడిన వివరణాత్మక కార్డియాక్ స్ర్కీనింగ్‌ను అందించడానికి ఈ యూనిట్ బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనిని బుధవారం నిర్వాహకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్రాస్ మెడికల్ మిషన్ నిర్వాహకులు ఎంఎం ఫిలిప్, జాన్సన్ లిఫ్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాస్ కె జాస్ తదితరులు పాల్గొన్నారు.