అందుకే లోదుస్తులతో తిరిగా : జేడీయూ ఎమ్మెల్యే వివరణ
ABN , First Publish Date - 2021-09-04T02:02:42+05:30 IST
లోదుస్తులతో రైళ్లో తిరగడంపై జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ స్పందించారు. అనారోగ్యంతో పాటు కడుపులో ఇబ్బంది ఉన్న

న్యూఢిల్లీ : లోదుస్తులతో రైళ్లో తిరగడంపై జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ స్పందించారు. అనారోగ్యంతో పాటు కడుపులో ఇబ్బంది ఉన్న కారణంగానే అలా తిరిగానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ‘‘నేను లోదుస్తులు ధరించాను. రైళ్లో ఎక్కడమే ఆలస్యం, కడుపులో ఇబ్బంది తీవ్రమైంది. నేను నిజమే చెబుతున్నాను. అబద్ధాలు ఆడటం లేదు’’ అని ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివరన ఇచ్చారు. అయితే తన వేషధారణ వల్ల కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్న విమర్శలపై కూడా స్పందించారు. తన కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఎవరూ లేరని గోపాల్ మండల్ వివరణ ఇచ్చారు.
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ లోదుస్తులు తిరిగి రైళ్లో ప్రయాణించారు. ఈ ఘటన తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లో జరిగింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూపీ దాటుతున్న సమయంలో ఆయన కేవలం లోదుస్తులతో బాత్‌రూమ్‌కు వెళ్లారు. అయితే తోటి ప్రయాణికుడు ఈ వేషధారణపై అభ్యంతరం తెలిపాడు.