మా మంత్రులకు హిందీ రాదు.. అందుకే సీఎస్‌గా ఆమె వద్దు: మిజోరాం CM

ABN , First Publish Date - 2021-11-09T19:46:33+05:30 IST

మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రేణు

మా మంత్రులకు హిందీ రాదు.. అందుకే సీఎస్‌గా ఆమె వద్దు: మిజోరాం CM

న్యూఢిల్లీ: మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రేణు శర్మ నియామకంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కేబినెట్ మంత్రులకు హిందీ తెలియదని, ఇంగ్లిష్ కూడా అర్థం చేసుకోలేరని, అందువల్ల మిజో భాష తెలిసిన అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. 


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్‌నున్మవియా చువావుగో పదవీ విరమణ చేసిన తర్వాత, ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని కోరానని ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ ఓ లేఖలో అమిత్ షాకు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించిందని పేర్కొన్నారు. తన కేబినెట్‌ మంత్రులకు హిందీ తెలియదని, ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోలేరని తెలిపారు. 


ఈ లేఖను అక్టోబరు 29న పంపించినట్లు ముఖ్యమంత్రి సలహాదారు ప్యూ సీ లాల్రంజవువా తెలిపారు. రేణు శర్మకు కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 28న ఆదేశాలు ఇచ్చింది. నవంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ అదే రోజు మిజోరాం ప్రభుత్వం కూడా ఓ ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నవంబరు 1 నుంచి బాధ్యతలను నిర్వహించాలని జేసీ రంతంగను ఆదేశించింది. 

Updated Date - 2021-11-09T19:46:33+05:30 IST