‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌’ విజేత మోనికా చావ్లా

ABN , First Publish Date - 2021-12-26T07:02:28+05:30 IST

యూఏఈలో వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్‌ మోనికా చావ్లా ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌’ విజేతగా నిలిచారు...

‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌’   విజేత మోనికా చావ్లా

దుబాయ్‌, డిసెంబరు 25: యూఏఈలో వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్‌ మోనికా చావ్లా ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌’ విజేతగా నిలిచారు. ఢిల్లీలో గత వారం జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన చావ్లా 16 ఏళ్లుగా వైద్యసేవలందిస్తున్నారు. ఢిల్లీలో పుట్టి, పెరిగిన ఆమె బ్రిటన్‌, స్పెయిన్‌, జర్మనీల్లో వైద్యవృత్తిలో రాణించి, అబుధాబిలో నివసిస్త్తున్నారు. పలు అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు రాశారు. 2018లో దుబాయ్‌ వైద్యశాఖ ఆమెను ‘బెస్ట్‌ ఫిజీషియన్‌ ఆఫ్‌ ది దుబాయ్‌’ అవార్డుతో సత్కరించింది.

Updated Date - 2021-12-26T07:02:28+05:30 IST