చర్చలు వాస్తవమే, కానీ.. CM రేసులో లేను

ABN , First Publish Date - 2021-12-26T17:49:09+05:30 IST

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చర్చలు వాస్తవమేనని అయితే ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, తానే సీఎం అంటూ ఎక్కడా చెప్పలేదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి తెలిపారు. బాగల్కోటెలో శనివారం

చర్చలు వాస్తవమే, కానీ.. CM రేసులో లేను

                     - మంత్రి మురుగేశ్‌ నిరాణి 


బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చర్చలు వాస్తవమేనని అయితే ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, తానే సీఎం అంటూ ఎక్కడా చెప్పలేదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి తెలిపారు. బాగల్కోటెలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ మార్పు అంశం ముఖ్యమంత్రి నిర్ణయానికి చెందినదన్నారు. పార్టీ జాతీయ నేతలు, రాష్ట్రానికి చెందిన ముఖ్యులు నిర్ణయిస్తారన్నారు. తాను ఎక్కడా సీఎం అవుతానని చెప్పలేదన్నారు. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోందో తెలియదన్నారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై కుటుంబంతో 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు అన్నలాంటివారని, ఫ్యాక్టరీలు, వ్యక్తిగత అంశాలైనా చర్చించుకుంటామన్నారు. బెంగళూరులో ఉంటే వారానికోసారైనా మా ఇంటికి భోజనానికి వస్తారని, తాను హుబ్బళ్లి వెళితే వారి ఇంటికి వెళ్లకుండా వెనుతిరగలేదన్నారు. ఇంతటి సత్సంబంధాలు కల్గిన తమ మధ్య పోటీ మాటేలేదన్నారు. మంత్రి ఈశ్వరప్పతో కలసి హోటల్‌లో భేటీని భూతద్దంలో చూడరాదన్నారు. ఒకే హోటల్‌లో దిగామని, అలా కలిశామన్నారు. 

Updated Date - 2021-12-26T17:49:09+05:30 IST