ఓపెనర్‌గా వెళ్లి 234 రన్స్‌తో నాటౌట్‌గా వస్తారు
ABN , First Publish Date - 2021-01-20T17:26:27+05:30 IST
ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్ మణియన్ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్ జయంతి వేడులను ...

ఈపీఎస్‌కు మంత్రి మణియన్ కితాబు
పెరంబూర్: ఓపెనర్‌గా బరిలో దిగి 234 రన్స్‌తో నాటౌట్ బాట్స్‌మెన్‌గా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిలుస్తారని మంత్రి ఓఎస్ మణియన్ కితాబిచ్చారు. నాగపట్టణం జిల్లా లో ఎంజీఆర్ జయంతి వేడులను పురస్కరించుకొని సోమవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చేనేత, ఖద్దరు శాఖ మంత్రి ఓఎస్ మణియన్ మాట్లాడుతూ, ప్రజా గ్రామసభల పేరిట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు.