ఇంటి వద్దే కొవిడ్‌ పరీక్షకు ‘ఎంఐ షెర్లాక్‌’

ABN , First Publish Date - 2021-08-10T08:46:03+05:30 IST

అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇళ్ల వద్దే సులువుగా కొవిడ్‌ పరీక్ష చేసుకోగలిగే కిట్‌ను అభివృద్ధి చేశారు.

ఇంటి వద్దే కొవిడ్‌ పరీక్షకు ‘ఎంఐ షెర్లాక్‌’

బోస్టన్‌, ఆగస్టు 9: అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇళ్ల వద్దే సులువుగా కొవిడ్‌ పరీక్ష చేసుకోగలిగే కిట్‌ను అభివృద్ధి చేశారు. దీనికి మినిమల్లీ ఇన్‌స్ట్రుమెంటెడ్‌ షెర్లాక్‌ (ఎంఐ షెర్లాక్‌) అని పేరు పెట్టారు. ‘స్పెసిఫిక్‌ హై సెన్సిటివిటీ ఎంజైమేటిక్‌ రిపోర్టర్‌ అన్‌లాకింగ్‌’ అనే దానికి సంక్షిప్త నామం ‘షెర్లాక్‌’. ఈ పరికరాన్ని వినియోగించి ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కలిగిన వారు లాలాజలం నమూనాతో తమ ఇంటి వద్దే కొవిడ్‌ పరీక్ష చేసుకోవచ్చు. గంటలోనే పరీక్షా ఫలితం వస్తుంది. ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లో పరీక్షా కిట్‌కు సంబంధించిన మొబైల్‌ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పరికరం ఆల్ఫా, బీటా, గామాతో పాటు డెల్టా కరోనా వేరియంట్లను కూడా గుర్తించగలదని పరిశోధకులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ల గుర్తింపులో 96% కచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇస్తుందన్నారు. 3డీ ప్రింటర్‌ ద్వారా ఈ పరికరాన్ని వాడొచ్చని, ఇందుకు రూ.1115 ఖర్చవుతాయని పేర్కొన్నారు. ఈ పరికరాలను ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ కొవిడ్‌ టెస్టు చేసుకునేందుకు ఒక్కో వ్యక్తికి రూ.450 మాత్రమే ఖర్చవుతాయి.

Updated Date - 2021-08-10T08:46:03+05:30 IST