ఎంజీఎంలో అరుదైన శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2021-10-29T15:55:50+05:30 IST

స్థానిక చూలైమేడులో వున్న ఎంజీఎం ఆస్పత్రిలో అరవయ్యేళ్ల ప్రవాసుడికి అరుదైన ఈఎన్‌టీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దుబాయ్‌కి చెందిన శంకర్‌కు కుడి చెవి భాగంలో భారీ కణితి ఏర్పడింది. దాంతో

ఎంజీఎంలో అరుదైన శస్త్రచికిత్స

చెన్నై(Chennai): స్థానిక చూలైమేడులో వున్న ఎంజీఎం ఆస్పత్రిలో అరవయ్యేళ్ల ప్రవాసుడికి అరుదైన ఈఎన్‌టీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దుబాయ్‌కి చెందిన శంకర్‌కు కుడి చెవి భాగంలో భారీ కణితి ఏర్పడింది. దాంతో అతనికి వినికిడిశక్తి తగ్గిపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.  దాని నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన అమెరికా వంటి దేశాల్లోని ఆస్పత్రులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అంతిమంగా ఆయన ఎంజీఎం ఆస్పత్రికి రాగా, పరీక్షించిన వైద్యులు ఇటీవల 13 గంటల పాటు నిరంతరాయంగా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. ప్రస్తుతం తాను కోలుకుని, క్షేమంగా డిశ్చార్జ్‌ అయినట్లు గురువారం ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

Updated Date - 2021-10-29T15:55:50+05:30 IST