నేల విడిచి సాము చేయకండి: బడ్జెట్‌పై మాయావతి

ABN , First Publish Date - 2021-02-01T23:45:25+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ విషయమై మాయావతి తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు క్షీణించిన ఆర్థిక వ్యవస్థ

నేల విడిచి సాము చేయకండి: బడ్జెట్‌పై మాయావతి

లఖ్‌నవూ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత వాగ్దానాలు, హామీలతో దేశంలోని కోట్ల మంది ప్రజలు విసిగెత్తి పోయారని, ప్రభుత్వాలు నేల విడిచి సాము చేయడం ఆపేయాలని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు క్షీణించిన ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ దేశం గట్టెక్కడానికి ఈ బడ్జెట్ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలని ఆమె అన్నారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ విషయమై మాయావతి తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు క్షీణించిన ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ దేశం గట్టెక్కడానికి ఈ బడ్జెట్ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి. ఈ రెండు జాతీయ సమస్యలను ప్రస్తుత బడ్జెట్ ఎంత వరకు పరిగణలోకి తీసుకున్నారు? దేశంలోని కోట్ల మంది పేదలు, రైతులు, శ్రమ జీవులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత వాగ్దానాలు, హామీలతో విసిగెత్తి పోయారు. వారి జీవితాలు నిరంతరం దు:ఖంతో నిండి ఉన్నాయి. ప్రభుత్వాలు తమ వాగ్దానాలను గుర్తెరిగి పని చేయాలి. నేల విడిచి సాము చేయకూడదు’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-02-01T23:45:25+05:30 IST