మోదీకి భారీగా తగ్గుతున్న ప్రజాదరణ!

ABN , First Publish Date - 2021-08-21T07:23:37+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గుతోందా? సెకండ్‌ వేవ్‌ తర్వాత అది మరింతగా

మోదీకి భారీగా తగ్గుతున్న ప్రజాదరణ!

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గుతోందా? సెకండ్‌ వేవ్‌ తర్వాత అది మరింతగా క్షీణించిందా? అంటే.. నిజమే అంటున్నాయి ఓ రెండు సర్వేలు. గత ఏడాది వరకు తిరుగులేని స్థితిలో ఉన్న ఆయన ఇమేజ్‌.. ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ఇటీవల విడుదలైన ఇండియా టుడే సర్వేలో కేవలం 24 శాతం మంది మోదీకి మద్దతు తెలుపగా.. తాజాగా విడుదలైన యూగవ్‌-మింట్‌-సీపీఆర్‌ మిలీనియల్‌ సర్వేలో 53 శాతం మంది మోదీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


దేశానికి కొత్త నాయకత్వం రావలసిన అవసరం ఉందని 46 శాతం మంది అభిప్రాయపడగా.. కరోనా సెకండ్‌ వేవ్‌ విధ్వంసానికి మోదీనే బాధ్యుడు అని 42 శాతం మంది తేల్చి చెప్పారు. కాగా, ప్రధాని పదవికి సరైన వ్యక్తిగా మోదీ తర్వాత స్థానంలో 11 శాతం మంది మద్దతుతో యోగి ఆదిత్యనాథ్‌ నిలవడం విశేషం. ఆ తర్వాత వరుసగా రాహుల్‌గాంధీ (10), మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌ (8) నిలువగా.. 7 శాతం మంది మద్దతుతో అమిత్‌షా కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. 


Updated Date - 2021-08-21T07:23:37+05:30 IST