మంగళూరు విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-29T16:26:32+05:30 IST
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణికుడి వద్ద 33 లక్షల విలువ చేసే
కర్ణాటక : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణికుడి వద్ద 33 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులను బురడీ కొట్టించడానికి ఓ కేటుగాడు బంగారాన్ని పేస్టుగా మార్చి, క్యాప్స్యూల్స్‌లో నింపి మలద్వారంలో దాచాడు. బంగారాన్ని సీజ్ చేసి ప్రయాణికుడిపై అక్రమ బంగారం రవాణా సెక్షన్ కింద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.