5 కోట్లిస్తే మోదీని చంపుతానంటూ పోస్టు.. చివరకు..

ABN , First Publish Date - 2021-02-06T10:42:06+05:30 IST

ప్రధాని మోదీని చంపడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన ఓ వ్యక్తి కథ అడ్డం తిరిగింది. ఈ మధ్య కాలంలో పాపులారిటీ కోసమో మరేదైనా కారణం కోసమే కానీ ఇలాంటి పోస్టులు ఎక్కువైన సంగతి

5 కోట్లిస్తే మోదీని చంపుతానంటూ పోస్టు.. చివరకు..

పుదుచ్చేరి: ప్రధాని మోదీని చంపడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన ఓ వ్యక్తి కథ అడ్డం తిరిగింది. ఈ మధ్య కాలంలో పాపులారిటీ కోసమో మరేదైనా కారణం కోసమే కానీ ఇలాంటి పోస్టులు ఎక్కువైన సంగతి తెలిసిందే. పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. తనకు 5 కోట్ల రూపాయలు ఇస్తే ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈ పోస్టును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దర్యాప్తు చేసి సదరు పోస్టు పెట్టిన 43ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్యానందంగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన అనంతరం సత్యానందాన్ని గురువారం నాడు స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2021-02-06T10:42:06+05:30 IST