‘జై బంగ్లా’ అంటూ నినదించిన మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2021-05-02T23:05:28+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బంపర్ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు

‘జై బంగ్లా’ అంటూ నినదించిన మమతా బెనర్జీ

కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బంపర్ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా కట్టడే తమ ప్రాథమిక కర్తవ్యమని ప్రకటించారు. ‘జై బంగ్లా’ అంటూ నినదించారు. అయితే ప్రస్తుత పరిస్థితులత దృష్ట్యా విజయోత్సవాలను జరుకోపమని ప్రకటించారు. అంతేకాకుండా కార్యకర్తలకు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ ర్యాలీలు, విజయోత్సవాలు జరుపుకోకూడదని ఆదేశించారు. ‘‘ అందరికీ ధన్యవాదాలు. విజయోత్సవాలను జరుపుకోకండి. కార్యకర్తలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోండి. 6 గంటల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-02T23:05:28+05:30 IST