అల్లుడిని కాపాడుకోవడానికే దీదీ మోదీకి మేలు చేస్తున్నారు: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-12-16T04:27:42+05:30 IST

కోల్‌కతా: అల్లుడు అభిజిత్ బెనర్జీని కాపాడుకునేందుకే టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మేలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

అల్లుడిని కాపాడుకోవడానికే దీదీ మోదీకి మేలు చేస్తున్నారు: కాంగ్రెస్

కోల్‌కతా: అల్లుడు అభిజిత్ బెనర్జీని కాపాడుకునేందుకే టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మేలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్షాలను బలహీనపరచడం ద్వారా దీదీ మోదీకి నేరుగా సహకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి చెప్పారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోందన్నారు. ఇంకెక్కడి యూపిఏ అని దీదీ అన్నప్పటినుంచి కాంగ్రెస్‌కు, టీఎంసీకి మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ లేని కూటమి కోసం మమత ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె అనేకమంది నేతలను కలుసుకుంటున్నారు. దీన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. తమ పార్టీలేని ప్రతిపక్షాల కూటమి సాధ్యమా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మమత బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క విమర్శ కూడా చేయడం లేదని టీఎంసీకి కమలం పార్టీకి మధ్య తెరవెనుక ఏదో జరుగుతోందని అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. 

Updated Date - 2021-12-16T04:27:42+05:30 IST